టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నాటకరంగ దిగ్గజం , రచయిత కృష్ణేశ్వర రావు (Krishneswara Rao) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్రమైన శ్వాసకోశ , గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నేడు గుంటూరులోని తన స్వగ్రామమైన ఎ.టి అగ్రహారంలో తుదిశ్వాస విడిచారు. నటుడిగా, రచయిత తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన కృష్ణేశ్వర రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

కాగా, కృష్ణేశ్వర రావు ఏకంగా 1500కు పైగా నాటకాల్లో నటించడమే కాకుండా ఎన్నో రచన నాటకాలకు రచన, దర్శకత్వం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచయితగా, నటుడిగా ప్రేక్షకులను అలరించారు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘చందమామ కథలు’, ‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి తన నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>