కలం, వెబ్ డెస్క్ : భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) తాజాగా జట్టు ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్‌ను( Shubman Gill) టీ20 జట్టులోకి తీసుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గిల్ టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా మంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని, వ్యక్తిగత ప్రదర్శన కూడా మెరుగుపడిందని పేర్కొన్నారు. అలాంటి ఆటగాడిని ఏ ఫార్మాట్ నుంచైనా తప్పించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు గిల్ జట్టులో చోటు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అతను అన్ని ఫార్మాట్లకు సరిపోయే ప్లేయర్ అని అజారుద్దీన్ అన్నారు. టీ20లలో కూడా అతను కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఇక దేశీయ క్రికెట్‌లో రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, ఆకిబ్ నబీలకు అవకాశాలు రాకపోవడంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ గత రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టెస్ట్ జట్టులో చోటు దక్కకపోవడం నిరాశ కలిగించిందని అన్నారు. అతనికి స్వింగ్ బౌలింగ్‌లో మంచి నైపుణ్యం ఉందని చెప్పారు. దేశీయ క్రికెట్‌లో బాగా ఆడితే అవకాశాలు వస్తాయని చెబుతుంటారని, కానీ అక్కడి ప్రదర్శనలకు సరైన గుర్తింపు లేకపోతే ఆటగాళ్ల పరిస్థితి ఏమవుతుందని అజారుద్దీన్ ప్రశ్నించారు. టెస్ట్ క్రికెట్‌కు సరిపోయే ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే భారత్ మరిన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలని, వివిధ పరిస్థితులలో ఆడటం ద్వారానే నిజమైన నైపుణ్యం బయటపడుతుందని చెప్పారు.
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) వచ్చిన అవకాశాన్ని అజారుద్దీన్ సమర్థించారు. అతను తన ప్రతిభతో ఆ అవకాశం సంపాదించాడని, మంచి నాయకుడిగా ఎదిగే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్‌ను ప్రస్తుత ఫామ్ ఆధారంగా జట్టు నుంచి తప్పించిన నిర్ణయాన్ని కూడా సమర్థించారు. గత విజయాల కంటే ప్రస్తుత ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై మాట్లాడుతూ, అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఆటగాళ్లు తమ శారీరక, మానసిక పరిస్థితిని బట్టి సరైన సమయాన్ని ఎంచుకోవాలని సూచించారు. దేశానికి ఎంతో సేవ చేసిన ఈ సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలని ఆయన అన్నారు. భారత క్రికెట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, ప్రతిభను గుర్తించి సరైన సమయంలో అవకాశాలు ఇవ్వడం ఎంతో కీలకమని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
Read Also: లివర్‌పూల్‌కు గుడ్‌బై.. రియల్ మాడ్రిడ్‌తో కొనాటే ఒప్పందం
Follow Us On: X(Twitter)

