‘ఎల్ నినో కన్నీటి కరువు’ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

కలం, జోగులాంబ గద్వాల: నీటి వృథాను అరికట్టడం, భవిష్యత్తులో రాబోయే కరువు తీవ్రతపై సమాజానికి అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘ఎల్ నినో కన్నీటి కరువు’ షార్ట్ ఫిల్మ్ పోస్టర్‌ను గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwan Basha Shaik) సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ​మనం ఇప్పుడు నీటిని వృథా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ లఘు చిత్రం కళ్ళకు కట్టినట్లు చూపించిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొనియాడారు.
​
“నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతతో భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. సమాజానికి ఎంతో అవసరమైన ఇటువంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన చిత్ర యూనిట్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు.” ​ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శేషు, నటులు లక్ష్మణ్, శేషన్ గౌడ్, హారిన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>