Mobile Popup Ad
Mobile Popup Ad

విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కోయంబత్తూరులో ప్రధాని మోదీ (PM Modi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై ప్రధాని మోదీ నిప్పులు చేరిగారు. మహిళల కోసం చేసిన ఓ ప్రయత్నాన్ని విపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో బిల్లు పెట్టామని.. కాంగ్రెస్ (Congress) , డీఎంకే (DMK) కలిసి ఈ బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. తన బాధను పంచుకోవడానికే కోయంబత్తూరుకు వచ్చినట్లు వెల్లడించారు.

సామాన్య మహిళలను ఎంపీలు, ఎమ్మెల్యేలను చేయాలన్నదే తన సంకల్పం అని ప్రధాని మోదీ (PM Modi) స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ విపక్షాలే తీసుకోవాలని కోరానని గుర్తు చేశారు. అయినప్పటికి కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును నీరుగార్చాయని మండిపడ్డారు. విపక్షాలు చేసిన తప్పుకి మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. అయితే రిజర్వేషన్ల కోసం తమ పోరాటం ముగియలేదని… మహిళాభ్యున్నతి కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మహిళా బిల్లును అడ్డుకున్నందుకు డీఎంకే నేతలను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. డీఎంకే నేతల చీకటి పనులు ప్రజలకు తెలుసునన్న ప్రధాని మోదీ.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి చెందడం ఖాయమని చెప్పారు. ఎన్డీయే మిత్రపక్షానికే ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

Read Also:  ఇన్‌ఫ్లూయెన్స‌ర్ చేతికి సీఎం రేవంత్ ఐపీఎల్ టికెట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>