లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కలం, నిర్మల్: దీర్ఘకాలంగా పెండింగ్‌‌లో ఉన్న లారీ యజమానుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ పరంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని లారీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో భాగ్యనగర్ లారీ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జీవో నంబర్ 60ను సవరించాలని, జాతీయ రహదారులపై లారీలు నిలిపేందుకు ప్రత్యేక ట్రక్ పార్కింగ్‌ లు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రమాదాల కేసుల్లో సమగ్ర విచారణ అనంతరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లారీ యజమానుల అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి. దుర్గాప్రసాద్, రాష్ట్ర కోశాధికారి గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్, జిల్లా అధ్యక్షుడు మధు, నాయకులు ఫయాజ్, జాకీర్ అహ్మద్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>