చావు అంచు నుంచి ఒక్క అడుగు.. అసలేమైంది?

కలం, వెబ్ డెస్క్​ : మాళ్వేజ్ ఘాట్ (Malshej Ghat) లోని కాలు జలపాతం వద్ద ఒక్క సెకను నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి దారితీసింది. ఒక యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు జలపాతం అంచుకు వెళ్లగా, అనుకోకుండా కాలు జారి లోయలోకి దొర్లుకుంటూ పోయాడు. చివరి క్షణంలో అతను ఒక రాయిని గట్టిగా పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ క్షణంలో పట్టు తప్పి ఉంటే కింద పారే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు.

అక్కడ ఉన్న పర్యాటకులు తక్షణమే స్పందించారు. చీరలు, దుస్తులను ఒకదానికొకటి ముడివేసి తాడులా మార్చారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, లోయలో చిక్కుకున్న యువకుడిని సురక్షితంగా పైకి తీశారు. కొన్ని క్షణాల అజాగ్రత్త కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చేది. సోషల్ మీడియా లైక్స్ కోసం ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>