ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలపై హైకోర్టు (TG High Court ) ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పథకాలతో ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయని న్యాయస్థానం ఆగ్రహించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపై కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఉచితాల వల్ల ఖజానా ఖాళీ అవుతుందని.. ప్రభుత్వాలు పాలనాపరంగా చేసే తప్పులు, నిర్లక్ష్యం కారణంగానే బాధ్యతయుతమైన అధికారులు చిక్కుల్లో పడుతున్నారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కంటోన్మెంట్ బోర్డుకు రావలసిన దాదాపు రూ. 33 కోట్ల స్టాంప్ డ్యూటీ సర్‌ఛార్జి బకాయిలను విడుదల చేయకపోవడంతో ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి వస్తుందని వెల్లడించింది.

ప్రభుత్వాలు అందిస్తున్న రైతుబంధు లాంటి పథకాల లక్ష్యం మంచిదే అయినప్పటికీ.. ఈ పథకం ద్వారా ఎంతోమంది కోటీశ్వరులు లబ్ది పొందుతున్నారని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు చేరాల్సింది పోయి అర్హత లేని ఉన్నత వర్గాలకు కూడా అందుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచితాల వల్ల పల్లెటూర్లలో పనిచేయడానికి కూలీలు కూడా దొరకడం లేదని.. రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆరోపించింది. ఉచిత పథకాల వల్ల ప్రజలు పనులు చేయడం మానేశారని వెల్లడించింది. పనికి ఆహారపథకం కింద కుబేరుడు కూడా కూలికి వస్తాడన్న ఆయన.. ప్రభుత్వాల తప్పిదాలకు అధికారులు బలికావాలా? అని ఆగ్రహించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>