ఫామ్ హౌస్ పాలన కాదు.. ప్రజా పాలన: అంజన్ కుమార్

కలం, ​కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ప్రజా సంక్షేమ దినోత్సవ’ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు. నగరం నడిబొడ్డున ఉన్న ఇందిరా చౌక్ వద్ద శ్రేణులు భారీగా తరలివచ్చి వేడుకలు జరుపుకోగా అనంతరం నగర వీధుల్లో నిర్వహించిన బైక్ ర్యాలీ (Congress Bike Rally) హోరెత్తింది. ​ఈ బైక్ ర్యాలీ ఇందిరా చౌక్ వద్ద ప్రారంభమై రాజీవ్ చౌక్, గాంధీ చౌక్, బాబు జగ్జీవన్ రామ్ చౌక్ మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌక్ వరకు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది.

​ఫామ్ హౌస్ పాలన కాదిది.. ప్రజా పాలన

​ఈ సందర్భంగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ (Vydhula Anjan Kumar) మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేదల సంక్షేమానికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. గత పాలకుల మాదిరిగా ఫామ్ హౌస్ లకే పరిమితం కాకుండా, ప్రజల గడప వద్దకే పాలనను తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిదని కొనియాడారు.

​ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, 75 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాయని తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందుతున్నాయని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు.

​ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం చార్జ్ షీట్ల పేరుతో నాటకాలాడుతున్నాయని ఎద్దేవా చేసిన అంజన్ కుమార్, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీనియర్ నేతలు వెలిచాల రాజేందర్ రావు, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, ఆకారపు భాస్కర్ రెడ్డి, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, సిహెచ్. బుచ్చి రెడ్డి, కాంతాల జగన్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>