కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం 9:15 గంటల సమయంలో ఎర్రబోడ, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్ తదితర ప్రాంతాల్లో పేలుడును పోలిన వింత శబ్దాలు వినిపించాయి. ఈ సమయంలో దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు అనిపించడంతో ఇళ్లలోని కిటికీలు వణికాయని, వస్తువులు కదిలాయని స్థానికులు తెలిపారు.
ఈ సమయంలో అసలేం జరుగుతుందో అర్థం కాక, భయాందోళనకు గురైన ప్రజలు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు, రోడ్ల పైకి పరుగులు తీశారు. ఎక్కడైనా భారీ పేలుడు సంభవించిందా లేక భూకంపం వచ్చిందా అనే అంశంపై నగరవాసులలో తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ (Rajendranagar), లంగర్‌హౌస్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. సమీపంలో క్వారీల్లో ఏవైనా బ్లాస్టింగ్స్ జరిగాయా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read : భారత్‌లో లీటెన్స్టైన్ ప్రిన్స్ అలోయిస్ పర్యటన
Follow Us On: X(Twitter)

