కరీంనగర్‌లో రూ.78 లక్షల నిధులతో అభివృద్ధి పనులు: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ను అభివృద్ధి చేయడం వైపే అడుగులు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా బుధవారం నగరంలోని 4వ డివిజన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దుర్షెడ్ – గోపాల్ పూర్ రోడ్డులో రూ. 78 లక్షల యుఐడిఎఫ్ నిధులతో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ భూపతి రవీంధర్, పలువురు కార్పోరేటర్లతో కలిసి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులకు కేంద్ర మంత్రి భూమీ పూజ చేసి పనులను ప్రారంభం చేశారు.

అనంతరం దుర్షెడ్- గోపాల్ పూర్ రోడ్డులో ఉన్న స్వయంభు విఘ్నేశ్వర స్వామీ ఆలయాన్ని మంత్రి బండి సంజయ్ సందర్శించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పోరేటర్లతో కలిసి స్వామీ వారిని దర్శించుకొని… ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లను స్థానిక కార్పోరేటర్ ప్రజలు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. యూఐడీఎఫ్ నిధులతో పాటు ఇతర గ్రాంట్ల నిధులతో పాలకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం చేసి.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. త్వరలో యూసీఎఫ్ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభం చేసి… ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పోరేటర్లు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>