రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ: సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ఆదేశాల మేరకు మంగళవారం కరీంనగర్‌లో రక్తదాన శిబిరాన్ని (Blood Donation Camp) నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడే మహోన్నత సేవ అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రక్తదానానికి కులం, మతం, ప్రాంతం, లింగభేదాలతో సంబంధం లేదని, ఇది మానవత్వానికి, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందించడం ఎంతో కీలకమని తెలిపారు. రక్తదానం చేసే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అనంతరం వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బంది సేవలను స్మరించుకుంటామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 47 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను గౌరవించడం, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ రక్తదాన కార్యక్రమంలో ఏసీపీ లు శ్రీనివాస్, శ్రీనివాస్. జి, వెంకటస్వామి, విజయకుమార్, స్వామి పాల్గొన్నారు. అంతేకాకుండా శిబిరానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉషారాణి, ఆర్ఎంఓ, వైద్య బృందానికి, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారందరికీ పోలీస్ శాఖ తరఫున సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>