పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల

కలం, నకిరేకల్: పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆశయమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. నకిరేకల్ (Nakrekal) మండలం నోముల గ్రామానికి చెందిన మాచర్ల శంకర్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన శంకర్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, అది నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవం, భరోసా అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నోముల గ్రామంలో మరిన్ని మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>