రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌.. నిర్మల్‌లో కాంగ్రెస్‌ నిరసన

కలం, నిర్మల్‌: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) ఉత్తరాఖండ్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన (Congress Protest) చేపట్టారు. బుధవారం గాంధీ పార్క్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ (Vedma Bhojju Patel) మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులపై రాజకీయ కక్షతో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

రాహుల్‌ గాంధీపై రాజకీయ దురుద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమం(Congress Protest)లో నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావుతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : రాజాసింగ్ జ‌న‌సేన‌లోకి వ‌స్తే ఆహ్వానిస్తాం: నేమూరి శంక‌ర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>