కలం, హనుమకొండ : పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో జరిగిన తప్పులకు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పుడే ఆ పార్టీ ఉనికిని కాపాడుకోగలదని పరకాల (Parakala) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) అన్నారు. మంగళవారం పరకాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చినా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ ఇంకా వాస్తవాలను అంగీకరించడం లేదని విమర్శించారు.
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్‌హౌస్ రైడ్ ఆరోపణలపై బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్‌కు లేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పరకాల ప్రాంతంలో రౌడీయిజానికి ఎలాంటి స్థానం లేదని, శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా పని చేస్తున్నామని ఆయన (Revuri Prakash Reddy) తెలిపారు.
Read Also: హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎం క్యాష్‌తో వ్యాన్ డ్రైవర్ పరార్
Follow Us On: Instagram

