కల్లూర్ కేజీబీవీలో రూ.74 లక్షల పనులకు శంకుస్థాపన

క‌లం, నిర్మ‌ల్‌: నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కుంటాల మండలం కల్లూర్ (Kallur) గ్రామంలో ఉన్న‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో శుక్ర‌వారం ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు జ‌రిగాయి. రూ.74 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ముథోల్ ఎమ్మెల్యే రామ్ రావు పాటిల్ పవార్ (Ramarao Patil Pawar), ఎంపీ గోడం నగేష్‌ (Godam Nagesh)తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా వికాసానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాఠశాలలో అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు మెరుగైన వాతావరణంలో చదువుకునేలా అవసరమైన వసతులను అభివృద్ధి చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>