బాధితులకు భరోసా.. ఆసుపత్రిలో సదుపాయాలపై పాయం తనిఖీ

కలం, ఖమ్మం బ్యూరో: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు ఆప్యాయంగా భరోసా కల్పిస్తూ, వైద్య సదుపాయాల తీరుతెన్నులపై పినపాక ఎమ్మెల్యే, శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateshwarlu) గురువారం క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాలను ఆరా తీశారు. వారికి అందుతున్న వైద్య చికిత్స, వైద్యుల సేవలు, ఆరోగ్య పరిస్థితుల మెరుగుదలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

​ఈ సందర్భంగా బాధితులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులు అందిస్తున్న చికిత్సపై పూర్తి నమ్మకం ఉంచాలని, వైద్యుల సూచనలను పాటించాలని సూచించారు. త్వరలోనే ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి చేరుకుంటారని బాధితులకు భరోసా కల్పించారు. ​అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, వార్డులను సందర్శించి రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందుల లభ్యత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>