ఈ నెల 20 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు : కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Insurance) పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా ప్రయోజనం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నమోదు ప్రక్రియలో లబ్ధిదారులకు ఎదురయ్యే సందేహాలు, అభ్యంతరాలు, సమస్యల పరిష్కారానికి జెడ్పీ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సమస్యలు ఎదురైన అర్హులైన కుటుంబాలు క్రింది నంబర్లను సంప్రదించాలని సూచించారు. గ్రీవెన్స్ కాల్ సెంటర్ నంబర్లు: ఇ. వెంకటేశ్వర్లు– 9951935312, శశిధర్ రాజు – 8247013660, యోగేష్ – 9441485893. అర్హులైన ప్రతి కుటుంబాన్ని పథకంలో నమోదు చేయడంతో పాటు, కుటుంబ వివరాలు, వయస్సు, నామినీ వివరాల సేకరణ, డేటా పరిశీలనను పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>