కలం, వరంగల్ బ్యూరో : తెలుగు భాషను మరవొద్దని, మన ఇతిహాసాలను చదవాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) విద్యార్థులకు సూచించారు. నక్కలగుట్ట (Nakkala Gutta) శ్రీ చైతన్య స్కూల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను బాలసముద్రంలోని క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా కన్నతల్లి లాంటి మాతృభాషను విస్మరించొద్దని చెప్పారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ ఇచ్చి రాజేందర్ రెడ్డి (Rajender Reddy) అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీ.జీ.ఎం. చేతన్, ఆర్.ఐ. మనోహర్, జోనల్ కోఆర్డినేటర్ జి.శివ కోటేశ్వరరావు, స్కూల్ ప్రిన్సిపాల్ సీమ, డీన్ సుప్రియ, ప్రైమరీ ఇన్చార్జి అనిత, తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి, రక్షిత, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రభుత్వ స్కూళ్లలో కనీస వసతుల్లేవు : సీతా దయాకర్ రెడ్డి
Follow Us On: Instagram


