​సంక్షేమానికి నిలువెత్తు రూపం వైఎస్సార్‌: మేడిపల్లి సత్యం

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యాలయంలో నివాళి కార్యక్రమం ఘనంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డిలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

వైఎస్సార్‌ పథకాలు ఆదర్శం..

​ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత రాల్లో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. ​ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని గుర్తుచేశారు.

​జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ ముద్ర:

​కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే సత్యం అన్నారు. ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, సాగునీటి కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందన్నారు. శాతవాహన యూనివర్సిటీతో పాటు కొండగట్టు, మంథనిలలో JNTU కళాశాలలు, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీల ఏర్పాటు ఆయన చలవేనని పేర్కొన్నారు. ​2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మనకు దూరం కావడం తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ శ్రేణులకు పిలుపు..

రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్నది వైఎస్సార్ కల అని, ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం, ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>