కలం, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. వెయ్యి రోజుల పాలనపై అందించిన నివేదికపై హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
రాబోయే రెండు సంవత్సరాలు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారని టీపీసీసీ చీఫ్ చెప్పారు. అలాగే, సమావేశంలో కొండా సురేఖ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. కొండా సురేఖపై తాము ఇవ్వాల్సిన సమాచారమంతా అగ్రనేతల ముందు ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. సురేఖ వివాదంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు.
Also Read : అయోధ్య ట్రస్ట్ సీఈవోగా జితేంద్ర మిశ్రా!
Follow Us On : WhatsApp

