కలం, వెబ్డెస్క్: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేడు పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను (Godavari Water) ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ (Polavaram Left Canal)ద్వారా గోదావరి జలాలు విడుదల చేశారు. పోలవరం ఎడమ కాలువ ప్రధాన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఎడమ కాల్వ ద్వారా విడుదలైన నీటితో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎడమ కాలువ నిర్మాణానికి రూ.4,192 కోట్లు ఖర్చు చేసింది. అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళికలు రూపొందించింది. మరో 23.44 టీఎంసీల నీటిని విశాఖ, అనకాపల్లి పరిధిలోని పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్నారు.
Also Read : అభిమాని మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్!
Follow Us On: X(Twitter)

