కలం, కరీంనగర్ బ్యూరో: దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించారు. బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ డా. షంషీర్ వయలిల్ మానవతా దృక్పథంతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. బుర్జీల్ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానించిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు సాయం చెక్కులు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు సత్యంగౌడ్, తెలంగాణ సామాజిక కార్యకర్తలు శ్రీనివాస్ రావు, శామ్యూల్, సలావుద్దీన్, ఎస్వీ. రెడ్డి, మహిపాల్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దుబాయ్‌లో ఎమ్మెల్యేకు సామాజిక కార్యకర్తలు నర్సింహులు, సత్యనారాయణ, భీంరెడ్డి, దేవేందర్ రెడ్డి సహకరిస్తున్నారు.

