కలం, వెబ్ డెస్క్: కూటమి నేతలు తన ఆస్తులు దోచుకోవాలని చూస్తున్నారంటూ ప్రజా శాంతి అధినేత కేఏ పాల్ (KA Paul) సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, పవన్ కళ్యాణ్ లు తన చారిటీ ఆస్తుల దోపిడీకి ప్లాన్ చేస్తున్నారంటూ పాల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే ఈ దారుణానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మోదీకి పాల్ ఓ రిక్వెస్ట్ చేశారు. 2014లో మోదీ విజయం కోసం పని చేశానని, తనకు న్యాయం చేయాలని కోరారు.
తనకు జరుగుతున్న అన్యాయం గురించి అందరికీ తెలియాలని, ఈ విషయం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, న్యాయ శాఖ మంత్రి అందరికీ తెలిసేలా ప్రతి ఒక్కరూ షేర్ చేయాలని కోరారు. తాను ప్రస్తుతం అంతర్జాతీయ శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నట్లు పాల్ వెల్లడించారు. గతంతో ఏడు యుద్ధాలు ఆపానని, ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చర్చలు జరుపుతున్నాని చెప్పారు. అలాగే ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు ఆ దేశ ప్రముఖులు, డొనాల్డ్ ట్రంప్‌తో కూడా సమావేశాలు కొనసాగుతున్నాయని పాల్ తెలిపారు.

