కలం, దిలావర్ పూర్: మహిళా సంఘాలను బలోపేతం చేసి, మహిళలను ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy) అన్నారు. దిలావర్ పూర్ మండలం లోలం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళ సంఘ భవనాన్ని (Womens Association Building) శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి, ఆర్థిక కార్యకలాపాల్లో మరింత ముందుకు సాగేందుకు వీఓ మహిళా సమైక్య సంఘ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు వివిధ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలత మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నాయకులు ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

