ఈ నెల 16న ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి : కలెక్టర్

కలం, ఆదిలాబాద్: పిల్లల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రత్యేకంగా ‘పిల్లల ప్రజావాణి’ (Childrens Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి సత్వర పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా సంరక్షణ అవసరమైన పిల్లలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు, దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, పోషకాహారం, బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, బాలల భిక్షాటన, వేధింపులు తదితర సమస్యలపై బాధితులు తమ అర్జీలను నేరుగా అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు.

పిల్లల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిగణనలోకి తీసుకొని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని, పిల్లల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బాలలపై ఎలాంటి వేధింపులు జరిగినా, వారి హక్కులకు భంగం కలిగినా నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పిల్లల సహాయం కోసం ఉచిత చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>