కలం, స్పోర్ట్స్: మాంచెస్టర్ యునైటెడ్ కొత్త హెడ్ కోచ్గా మారిసియో పోచెట్టినో (Mauricio Pochettino) నియమితులయ్యారు. ఈ విషయాన్ని క్లబ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్లో జట్టు ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఆడిన 10 మ్యాచ్లలో ఒక్కటే గెలిచి 18వ స్థానంలో నిలిచింది. దీంతో ఆరు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన మైఖేల్ కారిక్ను గురువారం క్లబ్ తొలగించింది. అమెరికా జాతీయ జట్టు కోచ్గా ఉన్న పోచెట్టినో.. తన సిబ్బందితో కలిసి ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. హైతీతో జరగాల్సిన మ్యాచ్ల అనంతరం ఆయన యునైటెడ్ జట్టుతో కలువనున్నారు. నవంబర్ 18 నుంచి రెడ్ డెవిల్స్తో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఫెర్గూసన్ రిటైర్మెంట్ తర్వాత యునైటెడ్ నియమించుకున్న 8వ మేనేజర్ పోచెట్టినో కావడం గమనార్హం.

