ప్రభుత్వ మొండివైఖరి వల్లే సమ్మె : కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో : ప్రభుత్వ మొండివైఖరి వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. 21వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు గురువారం కొత్తగూడెంలోని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన (MLA Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.

చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరికాదని, వారి పొట్టకొట్టే చర్యలను మానుకోవాలని సూచించారు. ఎన్నికల హామీల అమలు కోసం కార్మికులు చేపట్టిన ఈ ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సమ్మె వల్ల ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకముందే ప్రభుత్వం చర్చలు జరపాలని, లేనిపక్షంలో అసెంబ్లీలో కార్మికుల పక్షాన గళం వినిపిస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో కూడా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>