గొర్రెల కాపరికి అండగా ఎమ్మెల్యే కుంభం!

కలం, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు కేపాల్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో భారీగా గొర్రెలు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. రైలు ఢీకొనడంతో సుమారు 350 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ఘోర ప్రమాదంలో పోచంపల్లి మండలం జూలూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కృష్ణయ్య తన జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర నష్టానికి గురయ్యాడు. విషయం తెలిసిన వెంటనే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) స్పందించి, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద దృశ్యాలను పరిశీలించి, తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధితుడు కృష్ణయ్యను పరామర్శించారు. ఆయన కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.

రూ. లక్ష తక్షణ సాయం – ప్రభుత్వంతో మాట్లాడిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి తక్షణ ఊరటగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన వ్యక్తిగత నిధుల నుండి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, షీప్ అండ్ గోట్ ఫెడరేషన్ చైర్మన్, సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద తీవ్రతను వివరిస్తూ, బాధిత గొర్రెల కాపరి కృష్ణయ్యకు ప్రభుత్వం తరఫున పూర్తి నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సాయం అందేలా చూస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>