రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అధికారులను ఆదేశించారు. దుబ్బాక ప్రాంతీయ 100 పడగల ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సదుపాయాలపై ఎమ్మెల్యే సిబ్బందితో మంగళవారం సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని,ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డాక్టర్లను ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు సరైన సమయంలో అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యవసర సమయంలో వెంటనే వైద్య సేవలు అందించడంతో పాటు, మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు.

Read Also:  ‘నో స్టాక్’.. తెలంగాణలో డీజిల్ బాంబ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>