ఐటీలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తాం: లోకేశ్

కలం, వెబ్‌డెస్క్: ఐటీ అభివృద్ధిలో విశాఖను హైదరాబాద్ కంటే మెరుగ్గా మారుస్తామని మంత్రి లోకేశ్ (Minister Lokesh) ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన కాన్‌క్లేవ్ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలోనే విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారుతుందని అన్నారు.

అంతే కాకుండా విశాఖలో పూర్తిగా ఎకో సిస్టమ్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపారు. డేటా సెంటర్లు తీసుకురావడంతో పాటు వాటి నిర్వహణ కూడా చాలా ముఖ్యమని తెలిపారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటుందని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.

Read Also: జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ : మంత్రి అశ్వినీ వైష్ణవ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>