మురుగు నీరు నిల్వ ఉంటే కఠిన చర్యలు : రాజగోపాల్ రెడ్డి

కలం, మునుగోడు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినప్పుడే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) అన్నారు. మునుగోడు పట్టణ కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్ చేపట్టారు. పట్టణంలోని 1, 2, 3 వార్డుల్లోని గల్లీగల్లీల్లో తిరుగుతూ స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. పర్యటనలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాను ఎమ్మెల్యే పరిశీలించారు.

ఎమ్మెల్యే తమ వార్డులకు రావడంతో స్థానిక మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ ప్రవాహానికి అడ్డంకులు ఉండటంతో మురుగునీరు నిల్వ ఉండి, దోమలు వృద్ధి చెంది డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని గుర్తించారు. “మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండటానికి వీల్లేదు. అవసరమైతే ట్రెంచ్ కొట్టి అయినా నీరు సాఫీగా వెళ్లేలా తక్షణమే కార్యాచరణ మొదలుపెట్టాలి” అని పంచాయతీ, మండల అధికారులతో పాటు గ్రామ సర్పంచ్‌ను ఎమ్మెల్యే (Komatireddy Rajgopal Reddy) ఆదేశించారు. భౌగోళిక స్థాయిలను శాస్త్రీయంగా అంచనా వేసి, పట్టణానికి శాశ్వత పరిష్కారంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు సూచించారు.

డ్రైనేజ్ కనెక్టివిటీ, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నిర్వాహణతో పాటు చిట్యాల రోడ్డులోని మహాప్రస్థానంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానిక నాయకులు కోరగా, వాటికి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వయంగా బుల్లెట్ బైక్ నడుపుకుంటూ పట్టణమంతటా పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, స్థానిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>