కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ కత్తి నరేందర్ (Kathi Narender) కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఎస్సీ విభాగం చైర్మన్‌గా (SC Cell Chairman) నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ కట్ట శ్యామ్ మంగళవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

