Mobile Popup Ad
Mobile Popup Ad

రైతుల సంక్షేమమే లక్ష్యం.. నరసయ్యకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సూచనలు

కలం, కరీంనగర్ బ్యూరో: మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఆకుల నరసయ్య (Akula Narsaiah) ఆదివారం మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA kavvampally satyanarayana) ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందించి ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడాలని నరసయ్యకు ఎమ్మెల్యే సూచించారు. రైతులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందనిపేర్కొన్నారు.

కరీంనగర్ మార్కెట్ యార్డ్ పరిధిలో రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు పంట ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ అండగా నిలవాలని సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి, అర్బన్ డీసీసీ అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర రాజశేఖర్‌లను కూడా ఆకులు నరసయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరికీ శాలువాలు కప్పి సత్కరించారు. చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా నరసయ్యకు వారు అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>