Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ కోవ‌ర్టు పేరు చెప్పే దమ్ముందా?: ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్

క‌లం, మెదక్ బ్యూరో: బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్ (MLA Chinta Prabhakar) అన్నారు. ఎవరైనా కోవర్టులు ఉంటే తోడ్కలు తీస్తామని ప్రగల్భాలు పలుకుతున్న జగ్గారెడ్డికి నిజంగా దమ్ముంటే మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచిన‌ కోవర్టు పేరు బయటపెట్టాల‌ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని టీడీపీ కోవర్ట్ అని, పార్టీని నాశనం చేయడానికి వచ్చిన బ్లాక్ మెయిలర్ అని గాంధీ భవన్ మెట్లు మీద కూర్చొని తిట్టిన జగ్గారెడ్డి.. ఈ రోజు పదవి కాపాడుకోవడం కోసం అదే రేవంత్ రెడ్డికి వంతపాడటం దిగజారుడుతానికి నిదర్శనమ‌న్నారు.

ఫార్మాసిటీ రద్దుతో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, ఉద్యోగాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని చింత ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రైతులు,పేదలు,యువత సమస్యలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కుంటి సాకులు చెబుతూ మీడియా ముందు అడ్డగోలుగా మాట్లాడుతున్నడ‌ని విమర్శించారు. కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను దాచిపెట్టేందుకే బీఆర్ఎస్ పై జగ్గారెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>