కలం, నిర్మల్: ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ (Komaram Bheem) 86వ వర్ధంతిని సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చైన్ గేట్ సమీపంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం కొమురం భీమ్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

