ఆలేరులో ఆత్మ కమిటీ కొత్త పాలకవర్గం

కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఆత్మ కమిటీ (ATMA Committee) నూతన చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah), బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా నియమితులైన ఆత్మ కమిటీ చైర్మన్ ఎనగండ్ల సుధాకర్‌తో పాటు డైరెక్టర్లను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా సన్మానించి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఆత్మ కమిటీలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఆలేరు నియోజకవర్గంలోని రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సేవలు పూర్తిస్థాయిలో చేరేలా కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎనగండ్ల సుధాకర్‌తో పాటు నూతన డైరెక్టర్లందరికీ ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ప్రభుత్వం, రైతులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఆలేరు నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి, అర్హులైన ప్రతి రైతుకు వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు.కార్యక్రమంలో ఆత్మ కమిటీ నూతన చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతు ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>