మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: బాలు నాయక్

కలం, దేవరకొండ : మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) స్పష్టం చేశారు. బుధవారం దేవరకొండ మండలంలోని శేరిపల్లి, రత్యతండాల్లో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. గతంలో మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. సమాఖ్య భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి రోడ్లు, తాగునీరు, మురికి కాలువల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం రత్యతండాకు చెందిన ఆర్.శిరీష–హన్మంత్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వడిత్య పద్మ, వడ్త్య గోమి, మారుపాకుల సురేష్ గౌడ్, కొర్ర రామ్ సింగ్ నాయక్, కిన్నెర హరికృష్ణ, ఆర్. శంకర్ నాయక్, రామావతు శ్రీను, పలువురు వార్డు మెంబర్లు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>