కలం, గుడిహత్నూర్ : మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనకు తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని అదనపు కలెక్టర్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం భవన ఆవరణలో మొక్క నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల అభ్యున్నతికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో, సర్పంచ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

