నిర్మల్ అభివృద్ధిపై మైనారిటీ కౌన్సిలర్ల వినతి

కలం, నిర్మల్: నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే కేటాయించి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పట్టణానికి చెందిన మైనారిటీ కౌన్సిలర్లు (Minority Councillors) కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను ఆదివారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నగర అభివృద్ధి పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.15 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే మున్సిపాలిటీకి కేటాయించిన రూ.50 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ బడ్జెట్‌ను క్లియర్ చేసి, నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను త్వరగా విడుదల చేసి, పెండింగ్ పనులను పూర్తి చేసేలా సహకరించాలని మైనారిటీ కౌన్సిలర్ ప్రతినిధులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>