కలం, జడ్చర్ల: మిడ్జిల్ (Midjil) మండల కేంద్రంలో వినాయకులకు ఏడు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించి, ఆదివారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో రోజా భాస్కర్ నాయక్ రూ.1,51,000కు లడ్డూ దక్కించుకున్నారు. మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన వసీం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. మహిళల కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులు, యువత, మహిళలు, చిన్నారులతో శోభాయాత్ర నిర్వహించి నల్లచెరువులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
కార్యక్రమంలో వ్యాపార సంఘం అధ్యక్షుడు గంజి కృష్ణ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బరిగెల శ్రీనివాస్, సర్పంచి శంకర్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ హైమవతి బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గౌస్, నాయకులు రాజేశ్వర్, జంగారెడ్డి, చంద్రయ్య, భాస్కర్, విజయ్ కుమార్, శ్రీనివాసులు, వెంకట్ రెడ్డి, అశోక్, నరసింహులు, జహంగీర్, రవీంద్ర, బంగారు, శంకర్, కృష్ణ, శేఖర్, మల్లేష్, బసవరాజ్, యాదయ్య పాల్గొన్నారు.
200 మందికి అన్నదానం..
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు మూసా కాంపౌండ్ గణపతికి కాలనీవాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక టీఆర్ఎస్ నేత పెద్ది వెంకటేష్ దాదాపు 200 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. 30 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

