వేములవాడ ఆలయ విస్తరణే మా ప్రాధాన్యం: ఆది శ్రీనివాస్

కలం, రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (MLA Aadi Srinivas) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఇప్పటివరకు రూ. 390 కోట్లు కేటాయించామని, పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.

సిరిసిల్ల నేతన్నలకు భరోసానిస్తూ రూ.4 కోట్ల 70 లక్షల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో 3,797 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, రూ. 370.75 కోట్ల రైతు రుణమాఫీ అమలు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>