Mobile Popup Ad
Mobile Popup Ad

రెండ్రోజులు సంగారెడ్డి జిల్లాలో తాగు నీళ్లు బంద్

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో జూన్ 21, 22 తేదీల్లో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా (Water Supply) నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, మండలాల ప్రజలకు నీటి సరఫరా ఆగిపోనుంది. మిషన్ భగీరథ పరిధిలోని బూసారెడ్డిపల్లి ఫిల్టర్ బెడ్ నుండి బుదేరా వరకు ఉన్న 1200 మి.మీ. ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీకి అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉన్నందున, జూన్ 21 (ఆదివారం), జూన్ 22 (సోమవారం) తేదీలలో తాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు, మున్సిపాలిటీలు

పటాన్‌చెరు, అమీన్‌పూర్, ఇంద్రేశం, తెల్లాపూర్, సంగారెడ్డి (Sangareddy), సదాశివపేట, జహీరాబాద్, కోహిర్ .
మండలాలు & గ్రామాలు: మునిపల్లి, ఝరాసంగం, మొగుడంపల్లి, కంది, కొండాపూర్.

మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయబడుతున్న ఈ ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రెండు రోజుల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఈఈ విజయలక్ష్మి సూచించారు.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>