పగిలిన మిషన్ భగీరథ పైప్.. వృథాగా పారుతున్న నీరు

కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గం, పదర మండల పరిధిలోని వంకేశ్వరం (Vankeswaram) గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ (Mission Bhagiratha Pipeline) పగిలి నీరు తీవ్రంగా వృధా అవుతోంది. స్థానిక ఎస్సీ వసతిగృహం సమీపంలో మంగళవారం పైప్‌లైన్ పగిలిపోగా, బుధవారం కూడా నీరు వృధాగా పారుతూనే ఉంది.

అయితే, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే ఈ పైపులను కత్తిరించి ధ్వంసం చేశారని గ్రామస్తులు బలంగా అనుమానిస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే, పగిలిన పైప్‌లైన్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టి, తాగునీరు వృధా కాకుండా చూడాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>