Mobile Popup Ad
Mobile Popup Ad

కర్ణాటకలో దారుణం.. హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థిని ప్రసవం

కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలో (Karnataka) దారుణమైన ఘటన వెలుగుచూసింది. సిర్సి మండలంలో ఓ హాస్టల్‌లో ఉంటున్న 9వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన విద్యాసంస్థల్లో నివసిస్తున్న పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. సిర్సి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ (Minor) బాలిక ప్రసవించడంతో తల్లిదండ్రులు, స్థానికులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ నవజాత శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న సిర్సి తహసీల్దార్, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించారు.

ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభమైన కొన్ని రోజులకే ఈ ప్రసవం జరగడంతో ఆ బాలిక ఎలా గర్భవతి అయింది? ఇన్ని నెలల పాటు ఎందుకు బయటపడలేదు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుమార్తె హాస్టల్‌లో సురక్షితంగా ఉందనుకున్న తల్లిదండ్రులు ఈ వార్తతో ఆవేదన చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బాధ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. పోక్సో చట్టం కింద చర్యలు తీసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.

Read Also: కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన పలువురు సెలెబ్రిటీలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>