బైక్‌‌ను ఢీకొట్టిన తుఫాన్ వాహనం.. ఇద్దరికి గాయాలు

కలం, జోగులాంబ గద్వాల: ​గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోనుపాడు (Gonupadu Village) శివారులో మంగవారం సాయంత్రం బైక్‌ను తుఫాన్ వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడారు‌. ​స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల మండలం గోనుపాడు గ్రామానికి చెందిన శ్రీహరి తన బైక్‌పై పొలానికి బయలుదేరాడు. మార్గమధ్యలో పార్చర్లమిట్ట సమీపంలో ముందు వెళ్తున్న ఒక లారీని ఓవర్‌టేక్ చేయబోతుండగా, రాయచూర్ నుంచి గద్వాల వైపు వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం బలంగా ఢీకొట్టింది.

తుఫాన్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. బైక్‌పై ఉన్న శ్రీహరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పెబ్బేరు ఆస్పత్రికి తరలించారు. తుఫాన్ డ్రైవర్ కూడా గాయపడటంతో అతడిని గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>