కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను (Rajnath singh) జూబ్లీహిల్స్‌లో వివిధ రంగాల సెలెబ్రిటీలు మర్యాదపూర్వకంగా కలిశారు. నటులు అడవి శేష్, తేజా సజ్జా, బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్ కిదాంబి, ప్రముఖ షూటర్ ఇషా సింగ్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి రంగాల గురించి అడిగి తెలుసుకున్నరాజ్‌నాథ్ సింగ్.. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించి అభినందనలు తెలిపారు. అనంతరం, వివిధ రంగాల ప్రముఖులు కూడా ఆయన్ను కలిశారు. మోదీ పాలనపై వారు రచించిన పుస్తకాలను రక్షణ మంత్రి సమక్షంలో విడుదల చేశారు. మరికాసేపట్లో రాజ్‌నాథ్ సింగ్ సిక్ విలేజ్‌లో పర్యటించబోతున్నారు. అక్కడ మోదీ పాలన 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి హైదరాబాద్‌లోనే బస చేయబోతున్న కేంద్ర రక్షణ మంత్రి.. రేపు ఉదయం దుండిగల్‌లో నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కేడెట్ల సమావేశంలో పాల్గొంటారు.

