‘కలం’ వార్తకు స్పందన.. అక్కాపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు

కలం, నిర్మల్‌ రూరల్‌ : నిర్మల్‌ రూరల్‌ మండలం అక్కాపూర్‌ (Akkapur) గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్య పరిష్కారమైంది. దీనిపై ‘కలం’ డిజిటల్ పేపర్ లో ప్రచురితమైన వార్తకు విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. పంటలకు సాగునీరు అందించేందుకు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటును అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్లాట్ల భూ యజమానులు అడ్డుకుంటున్నారని, దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని ‘కలం’ డిజిటల్ పేపర్ వెలుగులోకి తీసుకురావడంతో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేష్‌ మంగళవారం గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం యుద్ధప్రాతిపదికన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించి విద్యుత్‌ సరఫరాను ప్రారంభించారు. సమస్య పరిష్కారం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను వార్త రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేసిన ‘కలం’ డిజిటల్ పేపర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>