కలం, నల్లగొండ బ్యూరో: హుజూర్‌నగర్ (Huzurnagar) పురపాలక సంఘం పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మోడల్ హౌసింగ్ కాలనీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 20 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Miniter Uttam) వెల్లడించారు. 2,160 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లతో నిర్మితమవుతున్న ఈ కాలనీని ఒక ఆదర్శవంతమైన టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
మంజూరైన ఈ 20 కోట్ల నిధులతో కాలనీలో అత్యాధునిక పాఠశాల భవనం, అన్ని వసతులతో కూడిన కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ కేంద్రం భవనం. స్థానిక అవసరాల కోసం షాపింగ్ కాంప్లెక్స్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ మెరుగు పరిచే పనులు చేపట్టనున్నారు. ఈ నిధుల కేటాయింపు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

