వైఎస్ వివేకా హ‌త్య కేసు.. సునీత‌కు బిగ్ షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన వైఎస్ వివేకానంద హ‌త్య కేసు (YS Viveka Murder Case)లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకా కుమార్తె సునీత (Sunitha) నాంపల్లి సీబీఐ కోర్టు (Nampally CBI Court)లో దాఖ‌లు చేసిన పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. శుక్ర‌వారం విచార‌ణ‌కు వ‌చ్చిన ఈ పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. సీబీఐ (CBI) ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించాల‌ని సునీత నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగలేదని, మరికొందరు అనుమానితులను విచారించాలని సునీత త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టులో వాద‌న‌లు వినిపించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాద‌న‌లు విన్న అనంత‌రం కోర్ట్ ఈ పిటిష‌న్‌ను కొట్టివేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>