ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆదేశించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లను మంగళవారం మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక ప్రగతి, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలు, ప్రణాళికలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబరు 7 నుంచి 9 వరకు ఈ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తోందని చెప్పారు.రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఇందుకు గ్లోబల్ సమ్మిట్‌ను ఒక కీలక వేదికగా వినియోగించుకోవాలని తమ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆతిథ్యం అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>